ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు శ్రీకారం చుట్టనుంది. భూముల విలువను పెంచి, తద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా వసూలు చేయనున్నారు. ఈ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై ఇప్పటికే అనేక విధాలుగా కసరత్తులు చేసిన ఏపీ ప్రభుత్వం... ఈ చార్జీల బాదుడును 10 నుంచి 50 శాతం మేరకు పెంచేందుకు సిద్ధమైంది. ఈ బాదుడు కూడా ఈ నెల 7వ తేదీ తర్వాత ఎపుడైనా చేపట్టవచ్చు.
ఈ భూముల విలువను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ఇప్పటివరకు ఎంతెంత విలువలున్నాయి?, కొత్తగా పెంచేందుకు రూపొందించిన ప్రతిపాదనలు ఏమిటి? పెరుగుదల ఎంత? అనే వివరాలను రూపొందించారు. జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి ఆ ప్రతిపాదనలకు ప్రాథమికంగా అనుమతి తీసుకున్నారు.