చంద్రబాబుపై రాళ్ళ దాడి మొత్తం డ్రామా: అంబటి

మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:23 IST)
ఏ సర్వే చూసినా వైసిపికి అనుకూలంగా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం మాదేనని స్పష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
 
తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. అందులో భాగమే రాళ్ళు ఎపిసోడ్. వారికి వారే రాళ్ళు వేసుకున్నారు. వారికి వారే సానుభూతి పొందాలని చూస్తున్నారు. 
 
ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఒక చిన్న రాయిని చూపిస్తూ రార్థాంతం చేస్తున్నారు చంద్రబాబు. సి.సి.ఫుటేజ్ మొత్తం పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటారు. అప్పుడే చంద్రబాబు నాయుడు నాటకం మొత్తం బయటపడుతుంది. అప్పుడు బాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు అంబటి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు