సుబ్బరాజు పేల్చిన బాంబు.. ప్రముఖ నిర్మాత తనయులూ బుక్కే.. గెస్ చేయవచ్చా?

శనివారం, 22 జులై 2017 (08:44 IST)
ఇంగ్లీషు మందులు కూడా వాడని తాను మత్తుమందుల జోలికి వెళతానా అంటూ సిట్ ముందు కూడా బీరాలు పలికిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు ఆ డ్రగ్స్ ఎవరెవరు వాడతారో పుల్ జాబితాను సిట్‌ముందు పరిచేసాడని తెలుస్తోంది. పైగా తెలుగు సినీ పరిశ్రమలో కీలకంగా వ్యవహరించే ఓ కుటుంబానికి చెందిన నిర్మాత ఇద్దరు తనయులు డ్రగ్స్‌ వినియోగిస్తారని నటుడు సుబ్బరాజు ఎక్సైజ్‌ సిట్‌ విచారణలో వెల్లడించినట్లు తెలియటంతో సదరు నిర్మాత భయాందోళనలకు గురవుతున్నట్లు సమాచారం. 
 
ప్రముఖ తెలుగు నిర్మాత తనయులతోపాటు మరికొందరు నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, వారి సంబంధీకులు విచ్చలవిడిగా డ్రగ్స్‌ వాడతారని చెప్పినట్లు సమాచారం. మొత్తంగా సినీ పరిశ్రమకు చెందిన దాదాపు 15 మంది పేర్లను సుబ్బరాజు వెల్లడించినట్లు తెలిసింది. ఈ డ్రగ్స్‌ దందా అంతా కూడా పబ్బులు కేంద్రంగా జరుగుతోందని బయటపెట్టినట్లు సమాచారం. తాను మాత్రం డ్రగ్స్‌ వినియోగించనని ఖరాకండిగా చెప్పడం విశేషం. 
 
శుక్రవారం ఉదయం సిట్ ఆఫీసుకు వచ్చిన సుబ్బరాజు మధ్యాహ్నం వరకు సిట్ ప్రశ్నలకు దొరక్కుండా దాటవేసినప్పటికీ కెల్విన్‌తో కలసి దిగిన ఫొటోలు చూపించడంతో దిగివచ్చాడని సమాచారం. సాయంత్రానికల్లా అధికారులు పలు ఆధారాలు చూపుతూ, గట్టిగా ప్రశ్నించడంతో... చివరికి సుబ్బరాజు తరచూ డ్రగ్స్‌ తీసుకునే కొందరి పేర్లు వెల్లడించినట్టు తెలిసింది. తెలుగు సినీ పరిశ్రమలో కీలకంగా ఉన్న ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన నిర్మాత ఇద్దరు తనయులు డ్రగ్స్‌ తీసుకుంటారని బయటపెట్టినట్లు సమాచారం. 
 
వారు మాత్రమే కాకుండా మరికొందరు నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, వారి సంబంధీకులు కలిపి మరో 13 మంది కూడా డ్రగ్స్‌ విపరీతంగా వినియోగిస్తారని సుబ్బరాజు వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలిసింది. ఇక డ్రగ్‌ దందాకు వేదికగా మారిన మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని పలు పబ్బుల పేర్లను కూడా సుబ్బరాజు బయటపెట్టినట్టుగా సిట్‌ వర్గాలు పేర్కొన్నాయి. 
 
డ్రగ్స్‌ వ్యవహారంలో ప్రస్తుతం విచా రణ ఎదుర్కొంటున్న వారేకాకుం డా.. దర్యాప్తులో వెల్లడవుతున్న మిగతా సినీ ప్రముఖులను కూడా విచారిస్తా మని ఎక్సైజ్‌ సిట్‌ చీఫ్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. సిట్‌ విచారణ తీరుపై వస్తున్న ఆరోపణల ను ఖండించారు. తాము చట్టప్రకారంగానే అన్ని ఆధారాలతో ముందుకెళుతున్నా మని.. తమ బృందంలో మంచి దర్యాప్తు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ వాడుతున్నట్టు ఆరోపణలు ఎదు ర్కొంటున్న మిగతా వారిని సైతం త్వరలోనే విచారిస్తామన్నారు. 
 
ఇక సుబ్బరాజు విచారణలో పలు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయని ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ తెలిపారు. సుబ్బరాజు చెప్పిన అంశాల ఆధారం గా మిగతా వారిని విచారించాలని సిట్‌ భావిస్తోందని.. కేసు దర్యాప్తులో సిట్‌ బృందాలు కొత్త కోణాన్ని అన్వేషిస్తున్నాయని చెప్పారు. ఈ కేసులో తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని, డ్రగ్స్‌ను నియంత్రించాలన్నదే ఎక్సైజ్‌ శాఖ ఉద్దేశమని పేర్కొన్నారు.
 
ఇంతకూ సుబ్బరాజు వెల్లడించిన ఆ ప్రముఖ నిర్మాత తనయులిద్దరూ ఎవరై ఉంటారబ్బా..? గెస్ చేసుకోండి మరి..

వెబ్దునియా పై చదవండి