Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

దేవీ

సోమవారం, 4 ఆగస్టు 2025 (17:03 IST)
Sunil narang, Nagarjuna, Shrutihasan
‘కూలీ’ కథ చెప్పిన తర్వాత నాకు చాలా నచ్చింది. ‘రజనీ సర్‌ ఈ కథ ఒప్పుకొన్నారా’ అని అడిగా. ఎందుకంటే ఈ కథలో ‘సైమన్‌’ పాత్ర  కథలో ఆల్ మోస్ట్ హీరోలాంటిది. లోకేష్ హీరో విలన్స్ ని ఈక్వెల్ గా చూపిస్తాడు. నా కెరీర్‌లో మొదటిసారి లోకేశ్‌ కథ చెబుతుంటే రికార్డు చేసుకున్నా. ఇంటికి వెళ్లాక మళ్లీ మళ్లీ విన్నా. నాకు అనిపించిన కొన్ని మార్పులు చెప్పా. మరొకరైతే, ఈజీగా తీసుకుంటారు. కానీ, నేను చెప్పిన విషయాలు పరిగణనలోకి తీసుకుని ‘సైమన్‌’ పాత్రను లోకేశ్‌ తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చింది అని నాగార్జున అన్నారు.
 
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 14న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా  మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
 
నాగార్జున మాట్లాడుతూ.. ‘నిన్నేపెళ్లాడతా’ చేసిన తర్వాత ‘అన్నమయ్య’ చేస్తుంటే.. ‘ఇప్పుడెందుకు ఇలాంటి కథ’ అని కొందరు నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయితే నాకు కొత్తదనం ఇష్టం. సెట్‌కు వెళ్లాక బోర్‌ కొట్టకూడదంటే డిఫరెంట్ పాత్రలు చేయాలి. ఆ ప్రయత్నంతోనే ఇంతకాలం పని చేశాను. కొన్ని దెబ్బలు తిన్నా. మంచి మంచి విజయాలూ అందుకున్నాను. ఒకరోజు లోకేశ్‌ నన్ను కలిసి ‘మీరు విలన్‌గా చేస్తానంటే మీకో కథ చెబుతా. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా’ అన్నారు. లోకేష్ ‘ఖైదీ,’ విక్రమ్ నా ఫేవరట్ ఫిలిమ్స్. ఆ సినిమాలు చూసిన తర్వాత ఎప్పటికైనా ఈ దర్శకుడితో పనిచేయాలని బలంగా అనుకున్నా.
 
రజనీ సర్‌ చెప్పినట్లు ఎప్పుడూ మంచి వాళ్లగానే సినిమాలో నటిస్తే బాగుండదు కదా. వైజాగ్‌లో మా ఫస్ట్‌ షూట్‌ జరిగింది. రెండో రోజు షూటింగ్‌ సందర్భంగా రికార్డు చేసిన వీడియో సోషల్‌మీడియాలో లీకై వైరల్ అయింది. అది సీన్ చూసి ‘మనుషులు ఇంత ఈవిల్ గా ఉంటారా?’ అని లోకేష్ ని అడిగాను. ఇంతకంటే ఈవిల్ గా ఉంటారని చెప్పారు. మీలో లోపల కూడా ఒక ఈవిల్ ఉన్నారని చెప్పారు. క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కి అది కాంప్లీమెంట్ గా తీసుకున్నాను. ఈ సినిమాను నిర్మించిన సన్‌ పిక్చర్స్‌ ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు. కానీ, వాళ్లు ఇచ్చిన బడ్జెట్‌లో రూ.5కోట్లు మిగిల్చి మరీ లోకేశ్‌ సినిమా పూర్తి చేశాడు. షూట్‌ సమయంలో ఆరు కెమెరాలతో పనిచేస్తాడు. చాలా వరకూ సన్నివేశాలు సింగిల్‌ టేక్‌లో ఓకే అయిపోయేవి. సినిమా కట్‌ వెర్షన్‌ చూసి డబ్బింగ్‌ చెబుతుంటే ఇంత బాగా నటించామా? అనిపించింది. నాకు మూవీలో నెగెటివ్‌ రోల్‌ ఇచ్చినా ఈ పాత్ర చేసిన అనుభూతి పాజిటివ్‌గా ఉంది. సత్యరాజ్‌, శ్రుతిహాసన్‌, సౌబిన్‌, ఉపేంద్ర అందరూ చాలా అద్భుతంగా నటించారు. ఈ షూటింగ్‌ సమయంలో రజనీ సర్‌ స్వయంగా వచ్చి నన్ను కలిసి మాట్లాడారు. అది ఆయన గొప్పదనం. నన్ను కలిసినప్పుడు కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. ‘మీరు ఇలా ఉన్నారని తెలిస్తే మన సినిమాలో నాగార్జున వద్దని లోకేశ్‌కు చెప్పేవాడిని’అని అన్నారు. ఆయనతో కూర్చొని మాట్లాడటం అద్భుతం. ఆయన యాక్టింగ్, స్టైల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని సినిమాలు చేసినా కూడా రజనీ సర్‌ పక్కకు వెళ్లి డైలాగ్స్‌ ప్రాక్టీస్‌ చేస్తారు. ఇంకా కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తారు. 
 
థాయ్‌లాండ్‌లో 17 రోజుల పాటు రాత్రి పూట యాక్షన్‌ సీక్వెన్స్‌ తీశాం. దాదాపు 350మందికి పైగా చాలా కష్టపడ్డాం. చివరి రోజు మొత్తం అందరినీ రజనీ సర్‌ పిలిచి తలో ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లలకు ఏమైనా తీసుకెళ్లండి అన్నారు. అంత మంచి హృదయం ఉన్న వ్యక్తి ఆయన. ఆయన కలిసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఇక అనిరుధ్ మ్యూజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా హిట్స్‌ ఇస్తూనే ఉన్నాడు. ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. ఇది నాకు చాలా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. చాలా న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా చేస్తూ ఒక బెటర్ యాక్టర్ గా ఫీల్ అయ్యాను. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'అన్నారు  
 
స్పెషల్ వీడియో బైట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ప్రేక్షకులకు. నమస్కారం నేను ఇండస్ట్రీకి 50 ఏళ్లు. ఈ సంవత్సరంలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నేను నటించిన ‘కూలీ’ ఆగస్టు 14న రావడం సంతోషంగా ఉంది. కూలీ నా డైమండ్ జూబ్లీ పిక్చర్. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్‌ కనగరాజ్‌ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇందులో పలువు స్టార్స్‌ నటించారు. చాలాఏళ్ల తర్వాత సత్యరాజ్‌తో చేస్తున్నా. ఇక శ్రుతిహాసన్‌, ఉపేంద్ర, సౌబిన్‌లతో పాటు ఆమిర్‌ఖాన్‌ స్పెషల్‌ అపియరెన్స్‌ ఉంది. సౌత్ ఫిలిమ్స్ ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున గారు ఇందులో విలన్‌గా చేస్తున్నారు. ‘కూలీ’ సబ్జెక్ట్‌ విన్న వింటనే సైమన్‌ పాత్ర నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా? అని ఎదురుచూశా. ఎందుకంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆర్నెళ్ల పాటు వెతికాం. ఈ పాత్ర గురించి ఒక యాక్టర్ తో ఆరుసార్లు సిటింగ్‌ అయింది. ఆయన్ని ఎలాగైనా ఒప్పిస్తాను అని లోకేశ్‌ నాతో అన్నారు. ‘ఎవరు ఆయన’ అని నేను అడిగా. నాగార్జున పేరు చెప్పగానే షాక్ అయ్యాను. ఆ తర్వాత ఆయన ఒప్పుకొన్నారని తెలిసి హ్యాపీగా అనిపించింది. నాగార్జున గారు డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఆయనకు ఆ అవసరం లేదు. ఎప్పుడూ మంచివాడిగానే చేయాలా? అని ఆయన సైమన్‌ పాత్రకు ఒప్పుకొని ఉంటారు.

మేమిద్దరం 33 ఏళ్ల కిందట ఒక సినిమా చేశాం. అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఇంకా యంగ్ గా కనిపిస్తున్నారు. నాకు జుట్టు కూడా ఊడిపోయింది. నాగార్జున గారితో పని చేస్తుండగా ‘మీ ఆరోగ్య రహస్యం ఏంటి’ అని అడిగాను. ‘ఏమీ లేదు సర్‌.. వ్యాయామం, స్విమ్మింగ్, కొద్దిగా డైట్‌. సాయంత్రం 6 గంటలకు డిన్నర్‌ అయిపోతుంది. మా నాన్న నుంచి వచ్చిన జీన్స్‌ కూడా ఒక కారణం. దాంతో పాటు, నా నాన్న నాకో సలహా ఇచ్చారు. ‘బయట విషయాలు తలలోకి ఎక్కించుకోవద్ద’ని చెప్పారు’ అని నాగార్జున గారు నాతో చెప్పారు. 17 రోజుల షెడ్యూల్‌ కోసం ఇద్దరం థాయ్‌లాండ్‌ వెళ్లాం. అది నా జీవితంలో మర్చిపోను. సైమన్‌ పాత్రలో ఆయన నటన చూస్తుంటే, నాకే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోనీ ఎలాగో.. కూలీ-సైమన్‌ అలా ఉంటుంది. సైమన్ గా నా నాగార్జున అదరగొట్టేశారు. అనిరుధ్ రవిచంద్రన్‌  అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమా గొప్పగా ఆడాలని మీరు అందరూ ఆదరరించాలని కోరుకుంటున్నాను'అన్నారు.
 
డైరెక్టర్ లోకేష్ కనకరాజు మాట్లాడుతూ, నాగార్జున గారిని ఈ సినిమాకి కన్విన్స్ చేయడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్. దాదాపు 7 నరేషన్స్  ఇచ్చాను. ఫైనల్ గా ఆయన ఒప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఈ సినిమాలో ఎంత అద్భుతంగా నటించారో మీరే చూడబోతున్నారు. అందరికీ థాంక్యూ సో మచ్.'అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు