సింహం ప్రాణం తీసిన పక్షవాతం...

ఆదివారం, 21 జులై 2019 (12:59 IST)
అడవిరాజు సింహానికి పక్షవాతం (పెరాలసిస్) సోకింది. దీంతో అది తీవ్ర అస్వస్థతకుగురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ జూ పార్కులో సంభవించింది. నిజానికి ఈ సింహానికి పెరాలసిస్ సోకినట్టు ఈ నెల 8వ తేదీన జూ పార్కు సిబ్బంది గుర్తించారు. దీంతో అది సరిగా నిలబడలేక పోవడంతో దానికి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ చికిత్సలు ఫలించక ప్రాణాలు విడిచింది. 
 
సింహం కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించగా, సింహంలోని అవయవాలు పని చేయలేదని, ముఖ్యంగా వెనుక కాళ్ళు చచ్ఛు పడినట్టు గుర్తించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. శాంపిల్స్‌ను సేకరించి వెటర్నరీ బయాలజికల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు పంపామని జూ అధికారులు వెల్లడించారు. క్రూరమృగాలకు ఈ విధమైన ప్రాణాంతక రుగ్మతలు సోకడం చాలా అరుదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు