ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యంపై జనసైనికులు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యం జాగ్రత్త అన్నా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌కు హాజరైన పవన్ కల్యాణ్.. ఆరోగ్యం సహకరించక పోవడంతో తిరిగి క్యాంప్ ఆఫీసుకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే చేతికి సెలైన్ డ్రిప్‌తో కనిపించారు పవన్ కల్యాణ్. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.