విజయవాడ: ప‌్రతిపక్ష నేత జగన్ దిష్టిబొమ్మ తగులబెట్టబోయిన తెలుగు తమ్ముళ్లకు విషాదం మిగిలింది. విజయవాడలో ఒక కార్పొరేటర్ ఒళ్ళు కాలి ఆసుపత్రి పాలయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో తెలుగు తమ్ముళ్లు చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
విజయవాడలోని రమేశ్ ఆస్పత్రి సెంటర్ వద్ద తెదేపా నేత గన్నె ప్రసాద్ నేతృత్వంలో కొందరు టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. జగన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తెదేపా కార్పోరేటర్ జాస్తి సాంబశివరావు దుస్తులపై పెట్రోల్ పడి ఆయనకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆందోళనకారులంతా భయంతో పరుగులు తీశారు.