బాంబులు వేసి చంద్రబాబును చంపేందుకు కుట్ర : టీడీపీ శ్రేణుల ఆరోపణ

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (12:21 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పరిసరాలను డ్రోన్‌తో చిత్రీకరిస్తున్న వ్యక్తులను పట్టుకున్న టిడిపి కార్యకర్తలు. చంద్రబాబు నాయుడుపై దాడి చేసేందుకు రహస్యంగా ఇంటి భద్రత, సెక్యూరిటీ ఉండే ప్రదేశాలు చిత్రీకరిస్తున్నారని ఇద్దరు వ్యక్తులు పై అనుమానం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు.
 
చంద్రబాబు నివాసం వద్ద కరకట్ట పై తెలుగుదేశం నేతలు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో రాకపోకలను అడ్డుకున్నారు. చంద్రబాబు నివాసంపై బాంబు దాడి యత్నం చేసే ప్రయత్నం చేసారని, డ్రోన్‌తో పాటు తెచ్చిన బాక్స్లో బాంబు ఉన్నట్టు అనుమానంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. 
 
అక్కడి నుండి వారిని తప్పించేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కిరణ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కుట్ర జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిజిపి పూర్తి స్థాయి‌లో దర్యాప్తు చెయ్యాలని డిమాండ్ చేశారు.
 
దీనిపై ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది. డ్రోన్‌ విజువల్స్‌ మేమే తీయమన్నామనీ, వరద పరిస్థితిపై అంచనాకోసం విజువల్స్‌ తీయమన్నామనీ, ఎగువ నుంచి వరద మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయనీ, ముంపునకు గురయ్యే ప్రాంతాలపై అవగాహన కోసం తీయమన్నట్టు ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు