దీనికి బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, ఆ తర్వాత బీజేపీలో చేరడం పార్టీ ఫిరాయింపు కిందికి రాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయింపులపై పురంధేశ్వరి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ అవినీతి, జగన్ సూట్ కేసు కంపెనీలపై ఏనాడైనా ప్రశ్నించారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మీరు వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీ అయిన వైఎస్సార్సీపీలో చేరి పోటీ చేస్తారని తెలిపారు.