ప్రశ్నాపత్రంలో క్వచ్చన్ పేపరులోనూ మార్పులు చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ మార్గదర్శకాలను విడుదల చేశారు. అన్ని ఎగ్జామ్ సెంటర్స్‌లో ఐసీఎంఆర్ సూచించిన నియమ, నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. స్టూడెంట్లకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎగ్జామ్ సెంటర్లను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
బీటెక్ ప్రశ్నాపత్రంలో పార్టు-ఏ, పార్టు-బీ విధానాన్ని తీసివేసి.. మొత్తం ఒకే విభాగంలో ప్రశ్నలు రూపొందించినట్లు యూనివర్శిటీ తెలిపింది. ప్రతి క్వచ్చన్ పేపర్ లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఐదింటికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయాన్ని కూడా 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించినట్టు గోవర్ధన్ వివరించారు.