కొత్త విధానం ప్రకారం.. ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మాథమెటిక్స్, జనరల్ సైన్స్(ఫిజిక్స్&బయాలజీ), సోషల్ స్టడీస్‌కు చెందిన పేపర్ -1, పేపర్-2లు ఒకే పరీక్షా పేపర్‌గా ఉండనున్నాయి. సెకండ్ లాంగ్వేజ్‌లో ఏ విధమైన మార్పు లేకపోగా.. ఫిజిక్స్, బయాలజీకి సంబంధించిన సమాధానాలు.. వేర్వేరు షీట్లలోనే రాయాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. జున్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. జున్ 16వ తేదీతో ముగుస్తాయి. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.