కాంగ్రెస్, బీజేపీలు రెండూ నాటకాలాడుతున్నాయి... టీజీ వెంకటేష్ ఫైర్.....

సోమవారం, 1 ఆగస్టు 2016 (18:39 IST)
కర్నూల్ : కాంగ్రెస్, బీజేపీపై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు కలసి రాష్ట్రంతో చెలగాటం ఆడుతున్నాయని, రాష్ట్ర విభజన విషయంలోనూ, ప్రత్యేక హోదా విషయంలోను, జిఎస్టీ బిల్లు విషయంలోను కాంగ్రెస్, బీజేపిలు కలిసే నాటకమాడాయని అన్నారు. రాజ్యసభలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఆ పార్టీకి దమ్ము, దైర్యం ఉంటే ప్రత్యేక హోదా బిల్లు ఆమోదించేంత వరకు బీజేపీ పెట్టిన ప్రతి బిల్లును అడ్డుకోవాలని  కోరారు. 
 
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మాట తప్పితే జగన్ రాష్ట్ర బంద్‌కు ఎందుకు పిలుపు ఇచ్చిందో అర్థం కావడం లేదని, ధైర్యం ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని అన్నారు. బీహార్ రాష్ట్రానికి 90 వేల కోట్లు బీజేపీ ఏ ప్రణాళికతో ప్రకటించిందని, ఏపీకి ఎందుకు ప్రణాళికలో లేదని ఎలా చెబుతున్నారని మండిప‌డ్డారు. 
 
చంద్రబాబుకు ఓపిక నశించే, కాంగ్రెస్ పెట్టిన బిల్లుకు మద్దతు ఇవ్వమన్నారని తెలిపారు. బీజేపీతో అమితుమి తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నామ‌ని, అయితే కొంతమంది పెద్దల సూచనతో ఆలోచిస్తున్నామ‌ని, మీడియాతో రాజ్యసభ సభ్యులు టి.జి వెంకటేష్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి