తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు. నడుచుకుంటూ కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు కొండపైకి వెళ్ళడానికి రెండు మెట్లు మార్గాలు ఉన్నాయి.
ఒకటి అలిపిరి మెట్లు మార్గం, మరొకటి శ్రీవారి మెట్టు మార్గం. అయితే ఎక్కువమంది అలిపిరి మార్గం ద్వారానే కొండ ఎక్కుతుంటారు. అయితే మరమ్మతులు, ఆధునీకరణ కోసం అలిపిరి మార్గాన్ని కొన్ని నెలల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) అధికారులు మూసివేశారు.
దీంతో ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే భక్తులు కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు . ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులు అనుమతించినట్లు ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ).
ఈ నెల 13 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి వస్తాయని చెప్పింది సప్తగిరి గుర్తుగా ఏడు రకాల అగరబత్తీలు తీసుకొస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
బ్రహ్మోత్సవాలు నుంచి శ్రీవారి క్యాలెండర్లు , డైరీలను అమ్మనున్నట్లు టీటీడీ చెప్పింది. ఈ నెల 19 న అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని పుష్కరిణిలో ఏకాంతం చక్రస్నానాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది.