మున్సిపల్ ఎన్నికలకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం

శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:03 IST)
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం రాతపూర్వక అంగీకారం తెలిపింది. త్వరలోనే ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. ఈ నెల 23 వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం.

వచ్చే నెల మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆగిన చోట నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగించే ఛాన్స్ ఉంది. ఎంపీటీసీ, జెడ్ పిటిసి ఎన్నికల నిర్వహణ పై న్యాయ నిపుణుల సలహా, సూచనల తర్వాత ఎన్నికలపై యస్ఈసీ నిర్ణయం తీసుకోనున్నారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసి న్యాయ సలహాలు తీసుకున్నారు. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో ఏకగ్రీవ లను  రద్దు చేయాలని మెజారిటీ పార్టీలు సూచిస్తున్నాయి. మెజార్టీ పార్టీలు కొత్త షెడ్యూల్ లను ప్రకటించాలంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు