రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం శిరస్సు ధ్వంసం, అపహరణ

మంగళవారం, 29 డిశెంబరు 2020 (21:44 IST)
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అయోధ్యగా ప్రసిద్ధి చెందిన విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై రామచంద్రమూర్తి విగ్రహాన్ని కొందరు గర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చెయ్యటం పట్ల హిందూ ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. ఈ ఉదయం విగ్రహం విధ్వంసం జరిగిన తీరుని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శివానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీరాముడి విగ్రహం శిరస్సుని ఖండించి తీసుకెళ్లిన క్రూరులపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గడచిన రెండేళ్లలో రాష్ట్రంలో 20 హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికీ ఇంతవరకు ఒక్కరిపై కూడా చర్యలు లేవన్నారు. సెక్యూలర్ దేశంలో ఇలాంటి అరాచకాలకు పాల్పడిన రాక్షసులను వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా స్వామి శివానంద డిమాండ్ చేశారు.
 
కాగా ఇందుకు నిరసనగా విజయనగరం బీజేపీ అధ్యక్షులు రెడ్డి పావని ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని రామతీర్ధాలు కొండపై చేస్తున్న దీక్ష చలిలో కూడా చేస్తున్నట్లు సమాచారం.
ఇలావుండగా శ్రీరాముని విగ్రహాన్ని కొందరు దుండగులు.విధ్వంసం చేసినందుకు నిరసనగా బుధవారం ఉదయం రామతీర్థం ఆలయం వద్దకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉదయం ఆ పార్టీ కార్యాలయం నుండి 9గంటలకు మౌనప్రదర్శన బయలుదేరి ఆలయం వద్ద కొనసాగించనున్నట్లు విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి అదితి గజపతిరాజు ఒకప్రకటనలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు