30 మంది మంత్రుల మీటింగుకే కరోనా అని భయపడ్డారు, మరి 15 లక్షల మందితో పరీక్షలెలా రాయిస్తారు?: లోకేష్
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:54 IST)
కోవిడ్ సెకండ్‌వేవ్ తీవ్రత దృష్ట్యా సెక్రటేరియట్‌లో ఇవాళ జరగాల్సిన కేబినెట్ మీటింగ్‌ని వాయిదా వేయించిన ముఖ్యమంత్రి గారూ! మీవి, మంత్రులవేనా ప్రాణాలు? లక్షల మంది విద్యార్థులవి ప్రాణాలు కావా? అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు.
ఇంటి నుంచి సెక్రటేరియట్‌కి అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ఆరోగ్యరక్షణ ఏర్పాట్ల మధ్య వెళ్లి 30 మంది మంత్రులతో దూరంగా ఉండి పాల్గొనే కేబినెట్ మీటింగ్ వల్లే కరోనా సోకుతుందని మీరు భయపడిన వాయిదా వేయించారు.
15 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పరీక్షల నిర్వాహకులు, ఇతరత్రా అంతా కలిసి 80 లక్షలమందికి పైగా పరీక్షల కోసం రోజూ రోడ్లమీదకు రావాల్సి వుంటుంది. మరి వారికి కరోనా సోకదా? పరీక్షలు ఎందుకు వాయిదా వేయరు? అంటూ నిలదీశారు లోకేష్.