రాజధాని ఆందోళనకు రైతు సంఘాల సంఘీభావం

మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:39 IST)
రాజధాని గ్రామాలలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ధర్నాలు నిర్వహిస్తున్న రైతాంగానికి సంఘీభావం తెలిపేందుకు వివిధ సంఘాలకు చెందిన రైతు సంఘం రాష్ట్ర నాయకులు మంగళవారం నాడు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

తొలుత ఉండవల్లి నుంచి ప్రారంభమై 10 గంటలకు పదిన్నర గంటలకు ఎర్రబాలెం 11 గంటలకు కృష్ణాయపాలెం 12 గంటలకు మందడం ఒంటి గంటకు వెలగపూడి రెండు గంటలకు రాయపూడి రెండున్నర గంటలకు తుళ్లూరు ధర్నా శిబిరాల వద్దకు రైతు సంఘం నాయకులు వెళ్లి రైతులకు సంఘీభావం తెలుపుతారు.

ఈ పర్యటనలో  మాజీ మంత్రివర్యులు రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వర రావు, రైతు నాయకులు వై. కేశవరావు, రావుల వెంకయ్య, పూల పెద్దిరెడ్డి ప్రసాదరావు పీ. నరసింహారావు, ఎలమంద రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు,

కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగబోయిన రంగారావు, పి. జమలయ్య, రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి జొన్న శివశంకర్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు