వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక చర్యలు

మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:12 IST)
రైతులకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

ఈ కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అయినప్పటికీ.. సరైన ధర రాకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరలతో రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంకీలక చర్యలు చేపట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞాన మార్పిడి, శిక్షణ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో పలు జాతీయ సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... రైతు భరోసా కేంద్రాలు ఆకాశమే హద్దుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. నేచురల్‌ ఫార్మింగ్‌కు సంబంధించి మరికొన్ని సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలన్నారు. అగ్రి మార్కెటింగ్‌ అంశాలపై కూడా ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు