చేబ్రోలు మండలంలోని తోట్లపాలెం గ్రామానికి చెందిన బాలిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. నాగార్జున యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతున్న గోపి అనే వ్యక్తితో ఆమెకు కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నాను, పెళ్లిచేసుకుంటాను అని లొంగదీసుకున్నాడు.
గోపి తాత, ఇతర బంధువులు తోట్లపాలెంలోనే నివసిస్తుండగా తరుచూ వారింటికి వచ్చినట్లుగా వచ్చి బాలికతో శారీరికంగా కలిసేవాడు. మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సమయంలో బాలిక అనారోగ్యానికి గురైంది. వైద్య పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. బాలిక తల్లిదండ్రులు గోపి కుటుంబాన్ని సంప్రదించగా పెళ్లికి నిరాకరించారు. పోలీసులను ఆశ్రయించి గోపీతో పెళ్లి జరిగేలా చేసారు.
అత్తారింటికి వెళ్లిన బాలికకు వేధింపులు తప్పలేదు. చిత్రహింసలు పెట్టారు, బయటకి తెలియనివ్వకుండా డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అబార్షన్ చేయించారు, గదిలో పెట్టి పస్తులు ఉంచారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో పోలీసుల సహాయంతో బాలికను ఇంటికి తీసుకువచ్చారు.