ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. దేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి లేరన్నారు. మహిళా భద్రత కోసం సిఎం నిరంతరం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి డిజిపితో మాట్లాడారని... ఆరు టీంలు ప్రత్యేకంగా వేశారని.. ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించారన్నారు. అంతేకాకుండా బాధితురాలికి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సపోర్ట్ ఇస్తున్నారని కూడా రోజా చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు రోజా. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం మానుకుంటే బాగుంటుందన్నారు.