ఫెయిలైన బ్రేకులు.. ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

సోమవారం, 6 నవంబరు 2023 (10:55 IST)
విజయవాడ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ బస్సు నియంత్రణ కోల్పోయి ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొదరు గాయపడ్డారు. ఈ సంఘటన విజయవాడ ఆర్టీసీ బస్టాండులోని 12వ నంబరు ప్లాట్‌ఫాంపై జరిగింది. ఆ సమయంలో మరో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ, చిన్నారితో పాటు గుంటూరు 2వ డిపోకు చెందిన వీరయ్య ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు.
 
విజయవాడలోని ఆటో నగర్ డిపోకు చెందిన ఈ బస్సు గుంటూరుకు వెళ్లాల్సి వుండగా ఫ్లాట్‌ఫాంపైకి వచ్చే క్రమంల బ్రేకులు ఫెయిలయ్యాయి. పైగా డ్రైవర్ రివర్స్ గేర్‌కు బదులుగా ఫస్ట్ గేర్ వేసి ఎక్స్‌లేటర్ రైజ్ చేయడంతో బస్సు ఒక్కసారిగా ఫ్లాట్‌ఫాంపై కుర్చీల్లో కూర్చొనివున్న ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. దీంకో బస్సు చక్రాల కిందపడి ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. 
 
మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన ప్రయాణికుడు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన జవాన్ 
 
ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతన్ని గమనించిన ఓ జవాను హుటాహుటిన సీపీఆర్ చేసి ఆ ప్రయాణికుడి ప్రాణాలు రక్షించారు. ఈ  ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఢిల్లీలోని నంగ్లోయ్‌ మెట్రో స్టేషన్‌లో అనిల్‌ కుమార్‌(58) అనే ప్రయాణికుడు మెట్రో స్టేషన్‌లో చెకింగ్‌ పాయింట్‌ దాటిన తర్వాత అకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఉత్తమ్‌కుమార్‌ సకాలంలో స్పందించి అతడికి కార్డియోపల్మనరీ రిససిటేషన్‌(సీపీఆర్‌) అందించడం ద్వారా ప్రాణాల్ని నిలబెట్టారు. 
 
ఈ ప్రక్రియ చేసిన వెంటనే ఆ ప్రయాణికుడు స్పృహలోకి రాగా.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్‌ఎఫ్‌ తన 'ఎక్స్‌' ఖాతాలో షేర్‌ చేయడంతో ఇది వైరల్ అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు