ఫ్లాట్‌ఫాం పైకి దూసుకొచ్చిన రైలు... మధుర రైల్వే స్టేషన్‌లో ఘటన

బుధవారం, 27 సెప్టెంబరు 2023 (10:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం జరిగింది. ఓ రైలు ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఫ్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన రజిగింది. అయితే అప్పటికే ప్రయాణికులంతా దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే ఒక్కరు మాత్రం గాయపడ్డారు. 
 
మధుర రైల్వే స్టేషన్ డైరెక్టర్ ఎస్.కె.శ్రీవాస్తవ కథనం మేరకు.. షుకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ రైలు రాత్రి 10.49 గంటల సమయంలో మధుర స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత రైలు ఒక్కసారిగా ఫ్లాట్‌ఫాం పైకి ఎక్కేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకై, ప్రాణభయంతో పరుగులు తీశారు. అంత ఎత్తున్న ఫ్లాట్‌ఫ్లాంపైకి రైలు ఎలా ఎక్కిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆ మార్గంలో ప్రయాణించాల్సిన కొన్ని రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. 


 

A horrible accident was avoided in #MathuraJunction.
The EMU train coming from Shakur Basti suddenly left the track and went onto the platform. Fortunately, nobody got injured.#Mathura #Tiger3Teaser #LeoUpdate #TejRan #SJaishankar #WorldTourismDay #ElderlyCARE #ICCWorldCup pic.twitter.com/m9vLiJZPeP

— ANJALI ARORA

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు