గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు కూలీలు మృతి

శనివారం, 24 ఏప్రియల్ 2021 (11:04 IST)
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. పలువురు కూలీలు గాయపడ్డారు.

ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ  ప్రమాదంలో మృతి చెందిన వారిని వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా గుర్తించారు పోలీసులు. వీరంతా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు