తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు కుదింపు, కారణమేంటంటే?

మంగళవారం, 1 జూన్ 2021 (17:29 IST)
తిరుమల శ్రీవారి దర్సన టోకెన్లు దొరకడం సాధారణంగా కష్టంతో కూడుకున్న పని. భారీ రెకమెండేషన్లు, విఐపిల లెటర్లు ఇలా తెగ హడావిడి చేస్తే తప్ప స్వామివారి దర్సన భాగ్యం దొరికే పరిస్థితి. దర్సనం దొరికిందంటే ఇక ఆ భక్తుడికి పెద్ద పండుగే. ఇదంతా ఎప్పటిదీ.... కరోనాకు ముందు మాట.
 
అలాగే సర్వదర్సనం టోకెన్లను టిటిడి గతంలో అందిస్తూ వచ్చింది. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే భక్తులు స్వామివారిని దర్సించుకుంటూ ఉండేవారు. అయితే సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్సనానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 
 
ఆన్ లైన్లో ఇప్పటి వరకు టిటిడి 15 వేల టోకెన్ల వరకు భక్తులకు ఇస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్సనాలను భారీగా కుదించింది టిటిడి. ప్రత్యేక ప్రవేశ దర్సన టిక్కెట్లను 5 వేలకు తగ్గించింది. టిక్కెట్ల సంఖ్యను కుదించడంతో తిరుమలలో భక్తుల సంఖ్య క్రమేపీ తగ్గనుంది. ఇప్పటికే సర్వదర్సన టోకెన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు