వైపాకా నేతలకు రంగుల పైత్యం : గర్భాలయానికి వైకాపా రంగులు

ఆదివారం, 30 మే 2021 (15:23 IST)
ఏపీలోని అధికార వైకాపా నేతలకు రంగుల పిచ్చి బాగా ముదిరిపోయినట్టు తెలుస్తోంది. ఒకవైపు కోర్టుతో అక్షింతలు వేయించుకుంటున్నప్పటికీ వారు ఏమాత్రం మారడం లేదు. తాజాగా మరోమారు వివాదానికి తెరతీశారు. గర్భాయలానికి వైకాపా రంగులు వేసి, తమ రంగుల పిచ్చిని మరోమారు బయటపెట్టారు. 
 
దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 22 నుంచి 29 వరకు వైశాఖమాస తిరు కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. 
 
అయితే శనివారం బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కావడంతో రాత్రి స్వామి వారి పవళింపు సేవ నిర్వహించారు. అయితే ఈ వేడుకకు సంబంధించి గర్భాలయంలో పూలు, పళ్లతో అలంకరణ చేశారు. ఈ అలంకరణలో వైసీపీ రంగులతో కూడిన ప్లాస్టిక్ పూల దండలను వినియోగించడం వివాదాస్పదంగా మారింది. 
 
గర్భాలయంతో పాటు ఆలయ ముఖద్వారాలకు గజ మాలలుగా వైసీపీ జెండా రంగుల ప్లాస్టిక్ పూలను వేలాడదీశారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్న ఉత్సవాల్లో.. ఇలా జరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈవోతో పాటు అధికారుల వైసీపీ పైత్యంపై భక్తులు మండిపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు