నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు

మంగళవారం, 23 మార్చి 2021 (09:38 IST)
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చే తీర్పునకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నెల 23న హైకోర్టు తీర్పును వెలువరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నిర్వహణకు న్యాయస్థానం ఆదేశిస్తే ఏర్పాట్లను వెంటనే చేసేలా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు.

గుంటూరు జిల్లాలో 8 జడ్పీటీసీ స్థానాలు, 226 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీమయ్యాయి. మిగిలిన 46 జడ్పీటీసీ స్థానాలు, 579 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. హైకోర్టు ఎన్నికల నిర్వహణకు మంగళవారం తీర్పు ఇస్తే వెంటనే పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకోవాలని పీఆర్‌ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను మౌఖికంగా ఆదేశించారు.

దీంతో జడ్పీ సీఈవో చైతన్య, ఎంపీడీవోలు, సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గతేడాది నోటిఫికేషన్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే 6 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో కోర్టు తీర్పుపై అటు రాజకీయనేతల్లో ఇటు అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు