బంగాళాఖాతంలో అల్పపీడనం - వచ్చే 24 గంటల్లో

బుధవారం, 27 అక్టోబరు 2021 (14:34 IST)
ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి విస్తరించిందని.. దీని కారణంగా రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే విషయాన్ని అమరవాతి వాతావరణ కేంద్రం కూడా తెలిపిన విషయం తెల్సిందే. దీంతో దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్రలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు