చావుబతుకుల మధ్య ఉన్న అభిమాని కోరిక తీర్చిన జూ.ఎన్టీఆర్

గురువారం, 7 అక్టోబరు 2021 (10:10 IST)
అభిమానుల మనసెరగడంలో టాలీవుడ్ హీరోలు ముందుంటారు. కష్టాల్లో ఉన్నట్టు తెలిస్తే కరిగిపోతారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే స్పందించారు. చావుబతుకుల్లో ఉన్న అభిమానిని పలకరించి అతడిని అనందంలో ముంచెత్తారు.
 
తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన కొప్పాడి మురళి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి మరింతగా విషమించింది.
 
ఈ క్రమంలో వైద్యులు అతడి కోరికలు, ఇష్టాయిష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉందని చెప్పాడు. 
 
ఈ విష‌యం తార‌క్‌కి చేర‌డంతో వీడియో కాల్ చేసి అత‌నితో మాట్లాడారు. అధైర్య‌ప‌డొద్ద‌ని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎన్‌టీఆర్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌ని కాల్‌లో చూసి అభిమాని సంతోషించారు.
 
ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంతో పాటు కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయ‌గా, ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు