రఘురామ కృష్ణంరాజు కంపెనీ దివాలా ప్రక్రియ మొద‌లు!

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (20:22 IST)
ఏపీలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కంపెనీకి చుక్కెదురయింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌కు వ్యతిరేకంగా తీర్పు వెలువ‌డింది. బ్యాంకుల కన్షార్షియానికి రూ.1,383 కోట్లకు పైగా బాకీ పడ్డ ఇండ్‌ భారత్ పై ట్రిబ్యూన‌ల్ విచార‌ణ జ‌రిపింది.
 
 
ఎంపీ ర‌ఘురామ కంపెనీ పంజాబ్‌ నేçషనల్‌ బ్యాంకుకు రూ.327 కోట్ల మేర బకాయి ఉంది. కొన్నాళ్లుగా బకాయిలు చెల్లించకపోవటంతో ఆస్తులు ఎన్‌పీఏ గా బ్యాంకులు ప్ర‌క‌టించాయి. వాటికి దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఎన్‌సీఎల్‌టీని  పీఎన్‌బీ ఆశ్రయించింది. రూ.1,327 కోట్లకు అప్పులకు గాను తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.872 కోట్లే ఉంది.


దివాలా ప్రక్రియకు అనుమతించవద్దంటూ వాదించిన రఘురామ కంపెనీ న్యాయ‌వాది వాద‌న‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. దివాలా ప్రక్రియకు ఓకే చేస్తూ, దివాలా పరిష్కార నిపుణుడి నియామకం చేప‌ట్టాల‌ని ఆదేశించారు. మూడు రోజుల్లో దివాలా పక్రియ గడువుతో సహా వివరాలన్నీ తెలియజేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఫారం–2 దాఖలు చేయాల్సిందిగా స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు