తిరుపతి లాంటి ప్రాంతాల్లో కరోనా బాధితుల కోసం టిటిడి కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేసేసుకుంది. భక్తుల కోసం కట్టిన వసతి సముదాయాలను ఏకంగా కరోనా బాధితులకు అందిస్తోంది. ఇప్పటికే టిటిడి ఉద్యోగస్తుల కోసం శ్రీనివాసం, మాధవం లాంటి వసతి గృహాలను కేటాయిస్తే తాజాగా బర్డ్ ఆసుపత్రిని కోవిడ్ బాధితులకు అందించేందుకు సిద్ధమైంది టిటిడి.
అంతేకాకుండా విష్ణునివాసంలోని 400 పడకలను కూడా కోవిడ్ బాధితులకే వినియోగించనున్నారు. కలెక్టర్ కోరిక మేరకు టిటిడి వసతి సముదాయాలను కోవిడ్ బాధితులకే అందించేస్తున్నారు. త్వరలోనే ఈ వసతి సముదాయాలన్నీ ప్రభుత్వానికి అందించనున్నారు. భక్తుల కోసం కేటాయించిన వసతి సముదాయాలు కోవిడ్ బాధితులకు ఉపయోగిస్తుండటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.