ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా ఏలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరికి కరోనా పాజిటివ్ ఖైదీ రోగులు ఆస్పత్రి నుంచి పారిపోయారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా ఉండే జైలులో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
ఈ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వీరిని స్థానిక సీసీఆర్ పాలిటెక్నిక్ కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, శనివారం తెల్లవారుజామున ఇద్దరు కరోనా పాజిటివ్ ఖైదీలు పత్తాలేకుండా పారిపోయారు.