హైదరాబాదులో కోఠి ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ రోగి పరార్

గురువారం, 18 జూన్ 2020 (15:48 IST)
కరోనా వ్యాధి సోకిన వ్యక్తి హైదరాబాదు కోఠిలోని ఓ ఆస్పత్రి నుంచి ఇంటికి పరారైన సంఘటన కలకలం సృష్టించింది. ఈ సంఘటన బుధవారం కింగ్ కోఠి ఆస్పత్రిలో జరిగింది. కరోనా బాధితుడు కోఠి నుండి తన ఇంటికి బస్సులో ప్రయాణించి పరారైపోవడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు.
 
వైద్య సిబ్బంది కథనం మేరకు, అతడు జూన్ 15న ఆసుపత్రి నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ ప్రయాణ సమయంలో వ్యాధిగ్రస్తుడు ఎవరితోనైనా కాంటాక్ట్ అయ్యాడేమోనని ఆరా తీస్తున్నారు. కాగా అతడు ఇంటికి చేరుకోగానే అతడి సోదరుడు వైద్యులకు సమాచారం అందించాడు. దీనితో వైద్యులు అతడిని హోం క్వారంటైన్లో వుంచారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు