మోదీపై విమర్శలొద్దు కాంగ్రెస్ నేతలు ఆలోచించండి.. పవన్ కల్యాణ్ ఫైర్

సెల్వి

శనివారం, 11 మే 2024 (15:37 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేతలపై ట్విట్టర్ వేదికగా ప్రధానిపై విమర్శలు చేయడాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత దేశం హీరోలను గుర్తించడంతో ప్రధాని ఎంతగానో ఉన్నతమైన పని చేశారని.. పద్మ అవార్డులను నిష్పక్షపాతంగా నిజజీవితంలో హీరోలైన వారికి అందజేశారని కొనియాడారని తెలిపారు. 
 
ప్రతిభావంతులను గుర్తించడంలో అద్భుతమైన మార్పు ప్రధాని మోదీ నాయకత్వంలో చోటుచేసుకుందని గుర్తు చేశారు. దేశ అత్యున్నత పద్మశ్రీ అవార్డులు ఎట్టకేలకు మన దేశంలోని నిజమైన, విభిన్న ప్రతిభావంతులను గౌరవిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. చాలా మంది అర్హులైన వ్యక్తులు పట్టించుకోని గత పోకడలను ప్రధాని బద్దలు కొట్టారని చెప్పారు. 
 
ప్రధాని మోదీజీ ప్రక్రియ భారత సంస్కృతిని పరిరక్షిస్తుందని పేర్కొన్నారు. అయితే చాలామంది భారతీయ సంస్కృతిని నిర్వీర్యం చేస్తున్నారు. అందుకే ఇది ప్రజలకు దగ్గరగా లేదు.. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు మోదీపై విమర్శలు గుప్పించేముందు మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించాలి. వారు రాష్ట్రాన్ని విభజించారు. ఆపై రాష్ట్రాలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకోవాలి. 
 
అందుకే కాంగ్రెస్ నేతలు మాట్లాడే ముందు మోదీపై విమర్శించడం మానుకోవాలి. భారత్‌ సంస్కృతిని కించపరిచకుండా వుండేందుకు ఇది ఎంతగానో సాయపడుతుంది. పద్మశ్రీ కాంగ్రెస్ హయంలో రాజకీయంగా మారింది. అయితే ఇప్పుడు ఆ సంస్కృతికి కళ్లెం పడింది. 
 
పద్మ అవార్డులు నైపుణ్యవంతులను, ప్రతిభావంతులను చేరుకుందని.. ఇది దేశంలో గొప్పమార్పుకు దారితీసిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన రియల్ హీరోలను పద్మ అవార్డ్ వరించిందని గుర్తు చేశారు. ఒక్కసారి పద్మ అవార్డుల పట్టికను పరిశీలిస్తే కాంగ్రెస్ నేతలకు ఇదేంటో అర్థం అవుతుందని తెలిపారు.

Remarkable shift in recognizing India's unsung heroes! Under PM Modi's leadership, the Padma Shree is finally honoring the true and diverse talents of our nation, breaking past trends where many deserving individuals were overlooked@narendramodi @PMOIndia @AmitShah @HMOIndiapic.twitter.com/Zr5QGlWYB7

— Pawan Kalyan (@PawanKalyan) May 11, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు