ఆగస్టు ఒకటో తేదీ నుంచి ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి వచ్చింది. ట్రిపుల్ తలాక్ చెబితే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది. తలాక్ బిల్లు అమలులోకి వచ్చినా, ఆ పేరుతో మహిళలకు అన్యాయం చేసే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఏమాత్రం భయం లేకుండా భార్యలకు చిన్న చిన్న కారణాల వల్ల తలాఖ్ చెప్పేస్తున్నారు పురుషులు.
ఇంతకీ ఏం జరిగిందంటే? కేవలం రూ.30 కోసం ఓ మహిళకు తలాక్ చెప్పేశాడో భర్త. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ జిల్లాకు చెందిన మహిళకు మూడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, కొన్ని రోజుల కిందట ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో మందులు కొనుక్కొనేందుకు రూ.30 కావాలని భర్తను అడిగింది. కానీ తన వద్ద డబ్బులు అడిగిన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త.. ఆమెకు తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు.
అంతేకాదు.. తలాక్ చెప్పేశాను కదా.. ఇక నా ఇంట్లో ఉండేందుకు వీల్లేదని ఇంట్లోంచి మెడ పట్టి బయటలకు గెంటేశాడు. దీంతో, బాధితులను తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.