భార్యభర్తలమని నమ్మించి లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు... ఆపై...

సోమవారం, 12 ఆగస్టు 2019 (15:47 IST)
వారిద్దరీ అక్రమ సంబంధం. శారీరకంగా కలుసుకునేందుకు వారిద్దరికీ వీలుపడలేదు. దీంతో ఓ లాడ్జీకెళ్లి భార్యాభర్తలమని నమ్మించి ఓ గదిని అద్దెకు  తీసుకున్నారు. చివరకు మహిళ మాత్రం ఫ్యానుకు ఉరిగా వేలాడగా, ఆమెతో లాడ్జీకి వచ్చిన వ్యక్తి మాత్రం పారిపోయాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని పెరియమేట్లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక పెరియమేడు వీవీ కోయిల్‌ వీధిలోని ఓ లాడ్జిలో భార్య భర్తలంటూ ఓ జంట అద్దెకు రూమ్‌ తీసుకుంది. శనివారం రాత్రి ఎంత సేపటికీ ఆ జంట బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి చూడగా, అందులో మహిళ మాత్రం ఉరికంబానికి వేలాడుతూ కనిపించింది. ఆపై రూమ్‌లో ఆమె భర్త కనిపించక పోవడంతో పెరియమేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేపట్టారు. ఈ విచారణలో మృతురాలు కొరుకుపేట రైల్వే స్టేషన్‌లో పనిచేసే మోహనగా గుర్తించారు. భర్త నుంచి విడిపోయిన ఆమె తిరువొట్రియూరు రైల్వే క్వార్టర్స్‌లో ఒంటరిగా జీవిస్తోందని, రైల్వే స్టేషన్‌ క్యాంటీన్‌‌లో పనిచేస్తున్న కడలూర్‌కు చెందిన వీరాస్వామితో మోహనకు పరిచయం ఏర్పడిందని, వారి పరిచయం వివాహేతర సంబంధంగా మారడంతో తరచూ అతను మోహన ఇంటికి వచ్చివెళ్లే వాడని తెలిసింది. స్థానికులు ఈ జంటపై అనుమానించడంతో మోహన తన ఇంటికి రావద్దని వీరాస్వామిని మందలించింది. ఈక్రమంలోనే వారిద్దరూ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకుని శారీరకంగా కలుస్తూ వచ్చినట్టు తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు