ఆ సుఖం కోసం వేశ్య వద్దకు వెళ్లాడు.. కానీ హీరోగా మారిపోయాడు..

శనివారం, 10 ఆగస్టు 2019 (14:48 IST)
అవును.. వేశ్యవద్దకు వెళ్లిన ఓ వ్యక్తి హీరోగా మారిపోయాడు. వేశ్య వద్దకు వెళ్లి అందరిలా ఆమెతో పడక సుఖం పంచుకోని ఆ వ్యక్తి ఆ బాధను అర్థం చేసుకుని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు మహిళా కమిషన్‌ను ఆశ్రయించి యువతిని కాపాడాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో పనికి వెళ్లాడు. 
 
ఖాళీ సమయం దొరకడంతో.. జీపీ రోడ్డులోని వేశ్యా వాటికకు వెళ్లాడు. అక్కడ ఓ యువతిని సెలెక్ట్ చేసుకుని గదిలోకి తీసుకెళ్లాడు. మాటల మధ్యలో ఆమె బెంగాలీ అని తెలుసుకున్న ఆ వ్యక్తి వివరాలు ఆరా తీశాడు. తాను కోల్‌కతాలో ప్రైవేటు ఉద్యోగం చేసేదానినని, వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోక మంచి ఉద్యోగం వెతుకుతున్న సమయంలో ఓ మహిళ జాబ్ ఇప్పిస్తామని నమ్మించి ఢిల్లీకి తీసుకొచ్చి వ్యభిచార ముఠాకు అమ్మేసిందని చెప్పి బాధితురాలు బోరుమంది.
 
తనను బయటకు వెళ్లకుండా నిర్బంధించారని, రోజుకు ఎంతమంది కస్టమర్లు వచ్చినా సుఖపెట్టాలని, ఎదురు తిరిగితే చావబాదుతారని వెల్లడించింది. ఆమె పరిస్థితి తెలుసుకుని షాకైన ఆ వ్యక్తి ఆమెను కాపాడేందుకు వీలుగా ఆమె సోదరుడి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఢిల్లీలో బాధితురాలి సోదరుడు ఫోన్ చేసిన వ్యక్తిని కలిసి ఢిల్లీ మహిళా కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 
 
కమిషన్ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు గురువారం వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసి యువతికి విముక్తి కలిగించారు. ఆమెను మోసం చేసిన మహిళపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు