అడవుల్లో ఉండాల్సిన గజరాజులు ఊళ్లలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నానా బీభత్సం సృష్టించడమేకాకుండా, తనకు అడ్డొచ్చిన వారిని తొండంతో చుట్టి నేలకేసికొడుతుంది. కాళ్లతో తొక్కి చంపేసింది. అలాంటి సంఘటన ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, హరిద్వార్‌లోని అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఓ మదపుటేనుగు గ్రామంలోకి దూసుకొచ్చింది. జనం మీద పడింది. తరిమి తరిమి కొట్టింది. దొరికిన ఓ వ్యక్తిని కాలుకింద నలిపేసి చంపేసింది. ఆ ఏనుగు బీభత్సం గురించి తెలిసి చుట్టుపక్కల గ్రామాల జనం గజగజా వణికిపోయారు.