తెలుగు భాష అమృతతుల్యం : వెంకయ్య నాయుడు

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (15:22 IST)
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక రోజు పర్యటన నిమిత్తం జెంషెడ్‌పూర‌కు వెళ్లారు. అక్కడ 103 యేళ్ళ నాటి ఆంధ్రభక్త శ్రీరామదాస ఆలయాన్ని సందర్శించారు. తన పర్యటనకు సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
జంషెడ్‌పూర్‌లోని 103 ఏళ్ల పురాతన ఆంధ్రభక్త శ్రీరామ మందిరాన్నిదర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది. భారత స్వాతంత్ర్య సమర సేనాని సుభాష్ చంద్రబోస్ సూచనలతో ఏర్పడిన ఈ మందిరానికి రావడం.. ఇక్కడి తెలుగువారితో కాసేపు గడపడం మరిచిపోలేని అనుభూతిని కలిగించింది. 
 
తెలుగువారు ఎక్కడున్నా మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. అమృతతుల్యమైన మన భాషను కూడా బతికించుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా.. మన భాషే మన అస్తిత్వం అనే విషయాన్ని మరవొద్దు.

 

జంషెడ్‌పూర్‌లోని 103 ఏళ్ల పురాతన ఆంధ్రభక్త శ్రీరామ మందిరాన్నిదర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది. భారత స్వాతంత్ర్య సమర సేనాని సుభాష్ చంద్రబోస్ సూచనలతో ఏర్పడిన ఈ మందిరానికి రావడం.. ఇక్కడి తెలుగువారితో కాసేపు గడపడం మరిచిపోలేని అనుభూతిని కలిగించింది. #jamshedpur pic.twitter.com/IPJLvzddVt

— Vice President of India (@VPSecretariat) February 17, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు