ట్విట్టర్‌లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబుకు నాలుగు సీట్లే, ధ్యావుడా....

సెల్వి

శుక్రవారం, 24 మే 2024 (19:50 IST)
వైకాపా నేత విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. మూడు సంవత్సరాలకు పైగా విశాఖపట్నం పార్లమెంట్‌లో పనిచేసిన సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరడంతో చివరి నిమిషంలో నెల్లూరు పార్లమెంట్‌కు ఎంపికయ్యారు.  
 
నెల్లూరులో సాయిరెడ్డికి సర్వే రిపోర్టులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత, సాయి రెడ్డి తిరిగి ట్విట్టర్‌లోకి వచ్చారు. వచ్చీ రాగానే చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. 2014లో చంద్రబాబు 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నారన్న ఆయన 2019 ఎన్నికల్లో నీకు వచ్చింది 23 స్థానాలేనని గుర్తు చేశారు. 
 
2024 ఎన్నికల్లో చంద్రబాబుకు కేవలం నాలుగు స్థానాలే వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు సీట్లకే పరిమితం కాబోతున్నావని తెలిసి నీ మీద జాలేస్తుందని విజయసాయి సెటైర్లు వేశారు.

చంద్రబాబూ...!
పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.
ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నది.
ఈసారి…

— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు