జగన్ నమ్మిన బంటు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్కి చెందిన మూడు వైసీపీ బోట్లని ఒకదానికి ఒకటి కట్టేసి, మూడు కలిపి ఒకేసారి ప్రకాశం బ్యారేజీ మీదకు వదిలేసారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు ఢీకొనడంతో వివాదం, ఆరోపణలు రావడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు విచారణ మొదలు పెట్టటంతో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్, ఉషాద్రి పారిపోయారు. దీనిపై విచారణ కొనసాగుతుంది.
బ్యారేజీలోకి దూసుకెళ్లే ముందు బోట్లను ఒకే గొలుసుతో కట్టి ఉంచారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన పడవలు వైఎస్ఆర్సీపీ నేతలవేనని, ఢీకొట్టడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.