విజయవాడ పట్టణంలోని సత్యనారాయణ పురం శ్రీనగర్ కాలనీలో భార్య తలనరికిన కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భార్య మణిక్రాంతను హత్య చేసిన భర్త ప్రదీప్ కుమార్.. పాటు ఆయన బంధువుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు నిర్ధారిస్తున్నాయి.
సీసీ టీవీ దృశ్యాలకు తోడు మణిక్రాంతి సోదరి పూజారాణి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. తన సోదరిని చంపుతుండగా చూసిన కొందరు తనకీ విషయం చెప్పారని పేర్కొంది. మణిక్రాంతిని చంపుతుండగా రికార్డైన దృశ్యాల్లో స్కూటీ ఆగి ఉండడం, ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి ఎక్కిన తర్వాత వెళ్లిపోయినట్టు ఉంది.
కాగా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మణిక్రాంతి కుటుంబ సభ్యులు, ప్రదీప్ బంధువులను విచారిస్తున్నారు. మణిక్రాంతి తలకోసం గాలిస్తున్న పోలీసులకు ఇప్పటి వరకు అది దొరకలేదు. తల లేకుండా పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని, చేసినా మృతదేహాన్ని తీసుకెళ్లబోమని మణిక్రాంతి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.