ఏపీ గ్రామాల్లో ఇంటింటికీ కొళాయి కనెక్షన్

మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:53 IST)
గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల తరహాలో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే నిమిత్తం నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

రూ. 4,800.59 కోట్ల విడుదలకు అనుమతి తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 91,40,605 ఇళ్లు ఉండగా అందులో 33,88,160 ఇళ్లకు ఇప్పటికే కుళాయి కనెక్షన్లు ఉన్నట్టు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు.

మిగిలిన 57,52,445 ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు రూ.10,975 కోట్లతో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జలజీవన మిషన్‌ పథకంలో భాగంగా 50% నిధులను కేంద్రం రాష్ట్రానికి ఇస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు