తప్పతాగి భీమవరం రోడ్డుపై అడ్డంగా పడుకున్న యువతి (video)

ఐవీఆర్

బుధవారం, 28 మే 2025 (14:46 IST)
మద్యం సేవించడంలో కొన్నిచోట్ల మగవారిని మించిపోతున్నారు మహిళలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇలాంటి దృశ్యం ఒకటి కనబడింది. భీమవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పూటుగా మద్యం సేవించిన ఓ యువతి రోడ్డుకి అడ్డంగా పడుకున్నది. మద్యం మత్తు తలకెక్కడంతో అక్కడే పడిపోయింది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
 
ఎవరు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఆ యువతి మాత్రం అంగుళం కూడా కదల్లేదు. దానితో వాహనదారులు తమ వాహనాలను ఆమెను తప్పించి ముందుకు సాగారు. సుమారు 20 నిమిషాల పాటు ఆ యువతి అలాగే రోడ్డుపై మత్తులో జోగుతూ అటుఇటూ దొర్లుతూ వున్నది. చివరికి పోలీసులు ఆమెను ఎలాగో అక్కడ నుంచి పక్కకు తీసుకుని వెళ్లారు.

Exclusive

భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్

ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఫుల్‌గా మద్యం తాగి రహదారికి అడ్డంగా పడుకున్న యువ‌తి

భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాం

దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే యువ‌తి#AndhraPradesh #APLiquor pic.twitter.com/5CWWZJotxA

— Telugu Feed (@Telugufeedsite) May 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు