విశాఖ ఉక్కు ఉద్య‌మానికి ఏడాది... ఫిబ్ర‌వ‌రి 23న రాష్ట్ర బంద్

మంగళవారం, 25 జనవరి 2022 (13:35 IST)
విశాఖ ఉక్కు ఉద్యమ కార్యాచరణను విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రకటించింది. అవ‌స‌ర‌మైతే, బీజేపీకి వ్య‌తిరేకంగా తాము 5 రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటామ‌ని ప్ర‌తినిధులు తెలిపారు. ఈ నెల 26న గుంటూరులో, 27న తిరుపతిలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కోటి సంతకాల సేకరణ చేపడతామని ఉక్కు పరిరక్షణ కమిటీ తెలిపింది. ఫిబ్రవరి 12న 365 మంది కార్మికులతో నిరాహారదీక్ష చేయనున్నట్లు ఉక్కు పరిరక్షణ కమిటీ పేర్కొంది. 
 
 
విశాఖలో ఫిబ్రవరి 13న బీజేపీ కార్యాలయాలు ముట్టడిస్తామని, ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ఉక్కు పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23, 24న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కూడా పాల్గొంటామని కమిటీ చెప్పింది. తమను ఆహ్వానిస్తే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఉక్కు పరిరక్షణ కమిటీ వెల్లడించింది.
 
 
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ కోటి సంతకాల సేకరణవిశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి కార్యాచరణ ప్రకటనవిశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఫిబ్రవరి 12కి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఏడో తేదీ వరకు కోటి సంతకాల సేకరణ జరుగుతుందని పోరాట సమితి నాయకులు చెప్పారు. కేంద్రం వెనక్కు తగ్గేంత వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు