విశాఖలో సెక్స్‌రాకెట్‌ గుట్టు రట్టు.. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే..?

ఆదివారం, 13 అక్టోబరు 2019 (17:19 IST)
విశాఖలో సెక్స్‌రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశాఖ సాగరతీరంలో జరుగుతున్న ఈ సెక్స్ రాకెట్ బండారాన్ని వెలుగులోకి తెచ్చారు. విశాఖ కంచెరపాలెం, మురళీనగర్‌లోని ఓ ఇంట్లో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోంది.

ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ఆ ఇంటిపై దాడి చేశారు. 
 
ఈ దాడిలో ఇద్దరు యువతులు, ముగ్గురు మహిళలతో పాటు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 5300 డబ్బు, ఐదు స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు