పడకసుఖం కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య...

బుధవారం, 11 సెప్టెంబరు 2019 (11:35 IST)
ప్రియుడితో పడకసుఖం పంచుకునేందుకు కట్టుకున్న భర్తనే కడతేర్చిందో కసాయి భార్య. హత్య జరిగిన 23 రోజులకు ఈ విషయం వెలుగు చూసింది. ఈ దారుణం విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా మద్దిలపాలేనికి చెందిన దల్లి జ్యోతి (26)కి సతీశ్ అనే వ్యక్తితో వివాహమైంది. సతీశ్ సైన్యంలో హవల్దార్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో గత నెల 19వ తేదీన పోలీసులకు ఫోన్ చేసిన జ్యోతి తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ బోరున విలపిస్తూ సమాచారం ఇచ్చింది. పైగా, సతీశ్ ఆత్మహత్యపై కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం లేదా సందేహం వ్యక్తం చేయలేదు. దీంతో సతీశ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడనీ పోలీసులతో పాటు... కుటుంబ సభ్యులు కూడా భావించారు. ఆ తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, అంత్యక్రియలు పూర్తిచేశారు.
 
అదేసమయంలో సైనికాధికారులను కలిసిన జ్యోతి.. తన భర్తకు రావాల్సిన నగదు, ఇతర బత్యాలను చెల్లించాలని డిమాండ్ చేయసాగింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు జ్యోతిని మరోమారు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
సిమ్మా భరత్ కుమార్ (24) అనే యువకుడితో 9 నెలల క్రితం జ్యోతికి పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చిన భర్త సతీశ్ కుమార్‌కు విషయం తెలిసి భార్యను హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.
 
గత నెల 18న భర్త తాగుతున్న మద్యంలో నిద్రమాత్రలు కలిపేసింది. దీంతో మద్యం తాగిన అనంతరం సతీశ్ మత్తులోకి జారుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా ముందుగానే అక్కడికి చేరుకున్న ప్రియుడు భరత్, కొత్తరేసపువానిపాలేనికి చెందిన గొడ్ల భాస్కర్ (22)లు ఇంట్లోకి చొరబడి చున్నీతో సతీశ్‌ మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టు అంగీకరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు