ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసోంలో ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న తన సోదరుడు బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పాడు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి, దోషులందర్నీ న్యాయస్థానం ముందు నిలబెట్టిందన్నారు. నిందితులంతా నిర్దోషులుగా విడుదలయ్యారనీ, అయినా తానేమీ చేయలేక పోయినట్టు చెప్పారు.
ప్రపంచమంతా ఏకమై ఒక నేరస్థుడిని కాపాడాలని భావించినా న్యాయవ్యవస్థ ప్రభావితం కారాదన్నారు. మన దేశంలో ధనికులకు, పేదలకు న్యాయం సమానంగా అందుతోందా? అని ప్రశ్నించారు. కోర్టులో నేరస్థుడు, హంతకుడు అని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ధనికుడిపై నేరారోపణ వస్తే గుండెపోటంటూ వెంటనే ఆస్పత్రిలో చేరిపోతాడు. అదే ఆరోపణ పేదోడిపై వస్తే వెంటనే జైలు పాలవుతాడు. తుది తీర్పు అతడికి వ్యతిరేకంగా కూడా రావచ్చన్నారు.