సుదీర్ఘ చంద్రగ్రహణం రోజున నరబలికి యత్నించారు మంత్రగాళ్లు. ప్రపంచం మొత్తం ఖగోళ అద్భుతాన్ని వీక్షిస్తుంటే మరోవైపు మంత్రగాళ్ళు మాత్రం నరబలికి శాయశక్తులా ప్రయత్నించారు. దీనికి కారణం సంపూర్ణ చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే శక్తులు వస్తాయని నమ్మి ఈ దారుణానికి పాల్పడేందుకు యత్నించారు. ఇది కృష్ణా జిల్లా నూజివీడు మండలం యనమదలలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం, కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన జొరిగే రామ్‌ప్రసాద్ మరికొందరు స్నేహితులతో కలిసి శనివారం ఉదయం సుంకొల్లు పరిధిలోని అటవీభూమిలో వనదేవత గుబ్బలమంగమ్మ గుడికి శంకుస్థాపన చేయడానికి వెళ్లాడు. ఆ గ్రామశివారులోని మామిడితోటలో ఒక రాయికి దండలు వేసి సాధారణ పూజ నిర్వహించారు.
ఆ సమయంలో అటువెళ్లిన చిన్నం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి.. క్షుద్రపూజలు జరుగుతున్నాయని భావించి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. అక్కడ క్షుద్రపూజల జాడలు కనిపించలేదు. అనుమానంపై రామ్‌ప్రసాద్, పామర్తిసాయి, వెంకటరామయ్య, శివ, మహేష్, కాకర్ల వీర్లరాఘవ, చౌదరి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. వీరిద్ద ఆరా తీస్తున్నారు.