ఫోన్ టాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు: ఎంఎల్ఏ అబ్బయ్య చౌదరి

సోమవారం, 17 ఆగస్టు 2020 (20:03 IST)
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం పై ఘాటుగా స్పందించారు ఎంఎల్ఏ అబ్బయ్య చౌదరి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను చేయదు మరియు ప్రోత్సహించదని  ధీటుగా జవాబిచ్చారు.
 
జాతీయ భద్రతా విషయాల్లోనే, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి ఉంటేనే ఫోన్ టాపింగ్ కి అవకాశం - ఆ పని మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేయగలదనీ, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు.
 
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడి ఫోన్లు టాప్ చేస్తున్నామని మరో విచిత్రమైన ఆరోపణ చెందుతున్న బాబు, ఆ సాంకేతికత వివరాలు ఎందుకు బయటపెట్టలేదు అని అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు. అసలు ఫోన్ టాప్ అయితే సదరు ఫోన్ వాడుకునే వ్యక్తి ఆ విషయం ఎలా తెలుసుకోవాలో ప్రజలకి తెలియచేయాలని కోరారు.
 
గతంలో చంద్రబాబు పై ఇవే ఆరోపణలు వచ్చినప్పుడు - 'సాక్ష్యాలు ఎక్కడున్నాయి?' ఎదురు అని అడిగారని, అంటే చంద్రబాబు సాక్ష్యాలు లేకుండా ఫోన్ టాపింగ్ చేయడం ఆయనకే తెలుసని మేము అనుకోవడంలో తప్పుందా అని అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు.
 
చంద్రబాబు అధికారం కోల్పోయాక తన చుట్టూ జరుగుతున్న విషయాల్లో మంచిని కూడా గుర్తించడం లో విఫలమవుతున్నారని, ప్రతి విషయంలోనూ ఆయనకి చెడు మాత్రమే కనిపిస్తున్నట్లు ఉందని   అబ్బయ్య చౌదరి తెలిపారు. ఈ ధోరణి ఆయన ఆరోగ్యం పై ప్రభావం  చూపెట్టెలోగా ఆయన మారాలని ఎంఎల్ఏ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు