'సీజ్ ద షిప్' : పవన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం... స్టెల్లా నౌక సీజ్ (Video)

ఠాగూర్

మంగళవారం, 3 డిశెంబరు 2024 (16:36 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పర్యటనలో రేషన్ అక్రమ బియ్యంపై కదంతొక్కారు. కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న వైనాన్ని ఆయన బట్టబయలు చేశారు. కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు వెళుతున్న స్టెల్లా అనే నౌకను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించి, సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీచేశారు.
 
పోర్టు ఉన్నది స్మగ్లింగ్ చేసుకోవడానికి.. మీ బాస్‌కు తెలుసా.. ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడో అని జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అంటూ నౌకా సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత మంత్రులకు భిన్నంగా స్పాట్‌లోనే స్పష్టమైన ఆదేశాలు ద్వారా పవన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా షీజ్ ద షిప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతూ, ట్రెండ్ అవుతున్నాయి.
 
అంతటితో విశ్రమించిన పవన్ కళ్యాణ్ మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి, అన్ని విషయాలను ఆయన వివరించారు. అదేసమయంలో పవన్ ఆదేశాలతో ప్రభుత్వ అధికారుల్లో కదలిక వచ్చింది. కాకినాడ పోర్టు నుంచి రేషశన్ బియ్యంతో తరలివెళుతున్న నౌకను అధికారులు సీజ్ చేసారు. అంతేకాకుండా, పవన్ ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లైస్, పోర్టు, కస్టమ్స్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ తాజాగా మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశారు. 


 

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న షిప్ సీజ్

గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు, రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్‌, కస్టమ్స్‌ శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసిన @CollectorKakin1
pic.twitter.com/J4D0iR0m0t

— JanaSena Shatagni (@JSPShatagniTeam) December 3, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు